02-07-2025 12:00:00 AM
- ప్రస్తుతం వసతులు మరింత మెరుగుపడ్డాయి
- లక్ష్య సాధన కోసం ఇష్టంగా చదవండి
- జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నసీం సుల్తానా
నాగర్ కర్నూల్, జూలై 1 ( విజయక్రాంతి )ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు అనుకూలంగా సౌకర్యాలు మరింత మెరుగు పడుతున్నాయని ఓ లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఇష్టంతో చదివి ఉన్నత శిఖరాలను తాకాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జిల్లా న్యాయమూర్తి నసీం సుల్తానా అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో న్యాయ సేవ అధికార సంస్థ, ఎస్బిఐ బ్యాంక్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు.
ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనం, హాజరు రిజిస్టర్లు, పరిసరాలు, పరిశుభ్రత వంటి వాటిని జిల్లా న్యాయమూర్తి పరిశీలించారు. మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులతో మాట్లాడుతూ తాను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పట్లో ఎలాంటి వసతులు లేకున్నా కష్టపడి చదివి ఉన్నత స్థితికి ఎదిగినట్లు గుర్తు చేశారు.
ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో వసతులు మరింత మెరుగు పడుతున్నాయని విద్యార్థులు వారి తల్లిదండ్రుల కలలను సాకారం చేసుకునేలా చదువుకోవాలన్నారు. అనంతరం విద్యార్థులకు జామెట్రీ బాక్సులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్బిఐ చీఫ్ మేనేజర్ రాకేష్ శర్మ, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ,కె రవి కాంతారావు , లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శ్రీ రాం ఆర్యా , హెచ్‌ఎం శోభన్ బాబు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులుపాల్గొన్నారు.