calender_icon.png 3 February, 2026 | 11:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్రిలింగేశ్వర ఆలయం హుండీ లెక్కింపు

03-02-2026 09:37:45 PM

ఆరు నెలలో త్రిలింగేశ్వర ఆలయం ఆదాయం 34 వేలు, ఒక బంగారు గొలుసు

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని తాండూర్ త్రిలింగేశ్వర ఆలయం యొక్క ఆరు నెలల ఆదాయం 34 వేలు, ఒక బంగారు గొలుసు రావడం జరిగిందని ఆలయ కమిటీ చైర్మన్ దత్తు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ దత్తు మాట్లాడుతూ...రానున్న శివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లు నిమిత్తం గ్రామస్తులు ఆలయ పరిసర గ్రామ ప్రజలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకొని శివరాత్రి జాతర ఏర్పాట్లు ఏ విధంగా చేయాలనే దానిపై చర్చించడంతోపాటు జమ ఖర్చుల వివరాలు మాట్లాడడం జరిగిందన్నారు.

ఈ సందర్భంగా ఒక్క లక్ష 25 వేల,,లోటు బడ్జెట్ ఉందని తెలిపారు. తదనంతరం ఆలయ కమిటీ గ్రామ పెద్దల ఆధ్వర్యంలో త్రిలింగేశ్వర దేవాలయం హుండీని తెరవడంతో హుండీలో చూసేసరికి ఒక బంగారు గొలుసు కనిపించిందని తెలిపారు. సుమారు దాని విలువ 1,25,000గా ఉండవచ్చు అన్నారు. నిర్వహణ ఖర్చుకు అయిన వ్యాయామ లోటుకు సరిసమానంగా దీని విలువ ఉండడం వల్ల అందరూ ఆశ్చర్యం కావడం జరిగిందన్నారు. భగవంతుని కార్యం సజావుగా జరగడానికి భగవంతుడే స్వయంగా అలా నిధి సమకూర్చాడని విశ్వసించి ఆనందం వ్యక్తం చేయడం జరిగింది.

ఈ కలియుగంలో కూడా ఇలాంటి మహత్కార సంఘటన జరగడం అనేది ఆపరమశివుడు త్రిలింగ రామేశ్వర స్వామి రూపంలో ప్రత్యక్షంగా ఇక్కడ కొలువై ఉన్నాడని చెప్పుకోవచ్చు అన్నారు. భగవంతుని కోసం భగవంతుని కోసం వినియోగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఎవరో అజ్ఞాత భక్తులు చిన్న కాగితం పొట్లంలో బంగారు గొలుసును హుండీలో వేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ దత్తు, సర్పంచ్ యాద గౌడ్, తదితరులు పాల్గొన్నారు.