calender_icon.png 17 September, 2025 | 9:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెన్నా చందర్ కుటుంబానికి అండగా ఉంటా..!

17-09-2025 07:47:16 PM

చిట్యాల,(విజయక్రాంతి): అనారోగ్యంతో బాధపడుతున్న స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ చెన్న చందర్ కుటుంబాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పరామర్శించారు. చందర్ కుటుంబానికి అండగా ఉంటూ అన్ని విధాలుగా ఆదుకుంటానని ఎమ్మెల్యే అన్నారు. బుధవారం రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ డాక్టర్ బెల్లయ్యనాయక్ తో కలిసి సీఎంఆర్ఎఫ్ క్రింద మంజూరైన రూ 1.90 లక్షల చెక్కును జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ చేతుల మీదుగా చెన్న చందర్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యనారాయణరావు మాట్లాడుతూ మూడు దశాబ్దాలుగా చందర్ తన వెంట నడిచాడని గుర్తు చేశాడు. తనకు ఎల్లవేళలా అండగా ఉంటూ సహకరించాడని తెలిపాడు.

ఆయన సేవలను గుర్తించి మార్కెట్ కమిటీ డైరెక్టర్ పదవిని కట్టబెట్టానని, తనను నమ్ముకున్న వారిని ఎప్పుడూ మరువబోనని ఈ సందర్భంగా సత్యనారాయణరావు వివరించాడు. చందర్ అనారోగ్యానికి గురై నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ ఆయన కుటుంబానికి అండగా ఉంటూ అన్ని విధాలా ఆదుకుంటానని భరోసా ఇచ్చారు. పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకోవడమే తన అభిమతమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలన్నీ పేదల చేరాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.