calender_icon.png 17 September, 2025 | 10:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు

17-09-2025 08:23:30 PM

గంభీరావుపేట,(విజయక్రాంతి): హైదరాబాద్ సంస్థానం 1948 లో ఇండియన్ యూనియంలో విలీనం అయిన సందర్భంగా బిజెపి ప్రతి ఏటా విమోచన దినోత్సవ వేడుకలను నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా మండల బీజేపీ అధ్యక్షుడు కోడ్ రమేష్ ఆధ్వర్యంలో బుదవారం తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను గంభీరావుపేటలో అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్బంగా మండల అధ్యక్షుడ్ కోడె రమేష్ జాతీయ పతకాన్ని ఎగుర వేసి, మహనీయుల చిత్రపటాలకు పూలు వేశారు.

ఆయన మాట్లాడుతూ... 1947 ఆగస్టు 15 భారతదేశానికి స్వతంత్రం వచ్చిన, అప్పటి హైదరాబాద్ రాష్ట్రానికి భారత యూనియన్ లో విలీనం కావడానికి పదమూడు నెలల సమయం పట్టిందని,  హైదరాబాద్ సంస్థనాన్ని విలీనం చేయడంలో సర్దార్ వల్ల భాయ్ పటేల్ కీలక పాత్ర పోషించాడనీ తెలిపారు. జిల్లా అధికార ప్రతినిధి కృష్ణ మాట్లాడుతూ వల్ల భాయ్ పటేల్ నిజం సామ్రాజ్యంపై ఆపరేషన్ పోలో తో చేసిన యుద్ధం ద్వారానే విలీనం జరిగిందన్నారు. గంట అశోక్ మాట్లాడుతూ... రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చాక విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుతామని తెలిపారు.