17-09-2025 07:56:55 PM
అచ్చంపేట: వీర తెలంగాణ విప్లవ పోరాట స్ఫూర్తితో మరో భూ పోరాటానికి సిద్ధం కావాలని సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు భూపాల్ పిలిపునిచ్చారు.అచ్చంపేట పట్టణంలోని టీఎన్జీవో భవనంలో ఆ పార్టీ మండల కార్యదర్శి సైదులు ఆధ్వర్యంలో జరిగిన సెమినార్‌లో ప్రసంగించారు. భూమికోసం, పీడిత ప్రజల విముక్తికి సాగిన విప్లవ పోరాటం ఎప్పటికీ మార్గదర్శకమన్నారు. నైజాం నవాబుల దాడులకు వ్యతిరేకంగా సాగిన ఆ పోరాటంలో వేలాది అమరులు ప్రాణాలను త్యాగం చేశారని, ప్రజల భాగస్వామ్యంతో 10 లక్షల ఎకరాల భూములు పేదలకు పంపిణీ చేసిన గొప్ప చరిత్రను గుర్తు చేశారు.
అమరవీరుల రక్త తర్పణంతో సాధించిన భూములను రక్షించేందుకు, ఇప్పుడు ఉన్న భూములపై కార్పొరేట్ సంస్థలు బలవంతంగా చేపడుతున్న సెక్యూరిటీ చర్యలకు సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకమన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలకు ప్రభుత్వ రంగాన్ని చెల్లించుకుంటోందని, పేదల భూములను కాపాడుకునేందుకు ప్రజలతో కలిసి పోరాడతామన్నారు.