17-09-2025 08:36:42 PM
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, పోలీస్ లైన్ సిబ్బందికి సూచించారు. మహబూబ్ నగర్ నగరంలోని పోలీస్ లైన్ లో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. పాఠశాల ప్రాంగణంలో శిధిలావస్థలో ఉన్న పోలీసు క్వార్టర్స్ వద్ద నిత్యం పందుల బెడదతోపాటు, అక్కడ విష సర్పాలు కూడా వస్తున్నాయని ఎమ్మెల్యే దృష్టికి పాఠశాల సిబ్బంది తీసుకురాగా వెంటనే అయన స్పందించి, పై అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. మహబూబ్ నగర్ నగరం లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో నెలకొన్న పరిస్థితులను వివరించారు, శిధిలావస్థలో ఉన్న పోలీసు క్వార్టర్స్ ను వెంటనే తొలగించాలని అధికారులకు ఆదేశించారు.