calender_icon.png 17 September, 2025 | 11:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం ఉమ్మడి వరంగల్ జిల్లా కో-ఆర్డినేటరుగా డా. జి సుధాకర్ యాదవ్ నియామకం

17-09-2025 08:54:49 PM

ములుగు,(విజయక్రాంతి): బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం ఉమ్మడి కరీంనగర్ జిల్లా సదస్సు సందర్భంగా డాక్టర్ జి సుధాకర్ యాదవ్ ని ఉమ్మడి వరంగల్ జిల్లా కో ఆర్డినేటర్ గా చైర్మన్ అయిన శ్రీ టీ చిరంజీవులు నియామకం చేయడమైనది. ఈ సందర్భంగా డాక్టర్ జి సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ సంవత్సరం జనవరిలో రిజిస్ట్రేషన్ అయి బీసీల కోసం సమర్ధవంతంగా, సరైన అవగాహనతో నికార్సయిన వాదన పటిమతో ఉద్యమాన్ని నడుపుతున్న శ్రీ టీ చిరంజీవులు నాయకత్వంలో పనిచేస్తున్న బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం ఉమ్మడి వరంగల్ జిల్లా కో ఆర్డినేటర్ గా నాపైన నమ్మకంతో నియామకం చేయించినందుకు, చీఫ్ కో ఆర్డినేటర్ డాక్టర్ కె వీరస్వామికి ధన్యవాదములు తెలియచేసారు. అలాగే బీసీ మేధావుల వేదిక ఆశయాల కనుగుణంగా పనిచేస్తూ చిరంజీవులు నాయకత్వంలో బీసీలకు చెందిన అన్ని రకాల హక్కుల కోసం పూర్తిగా నిబద్ధత కలిగిన కార్యకర్తగా నా వంతు కృషి చేస్తానని ములుగు జిల్లాలో బీసీలను ఐక్యం చేయడంలో తనవంతు పాత్రను నిర్వర్తిస్తానని రాజ్యాధికారం కోసం అందరినీ కలుపుకొని ఐక్య ఉద్యమాన్ని నిర్మిస్తానని పేర్కొన్నారు.