calender_icon.png 17 September, 2025 | 10:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

సిరి సంపదలు కలగాలి: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

17-09-2025 08:27:09 PM

మహబూబ్ నగర్,(విజయక్రాంతి):  విశ్వకర్మ  భగవానుడి ఆశీస్సులతో  ప్రజలందరికీ  ఆనందం, అభివృద్ధి, సుఖసంతోషాలు,  సిరిసంపదలు కలగాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆకాంక్షించారు. భగవాన్ విశ్వకర్మ జయంతి సందర్భంగా మహబూబ్ నగర్ నగరంలోని మోనప్పగుట్టలో గల మౌనేశ్వర స్వామి దేవాలయం లో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి,  అనంతరం యాగశాలలో జరిగిన యజ్ఞంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అందరికీ విశ్వకర్మ భగవానుడి జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు.  మౌనేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణంలో అసంపూర్తిగా ఉన్న మల్టీ పర్పస్ కమ్యూనిటీ హాలు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని హామి ఇచ్చారు.  విశ్వకర్మ జయంతి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో  ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును ప్రారంభించారు.