calender_icon.png 17 September, 2025 | 10:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

నటుడు రచయిత దర్శకుడు రాజేశ్వరరావు కన్నుమూత

17-09-2025 08:51:37 PM

కరీంనగర్ క్రైమ్,(విజయక్రాంతి): నటుడు రచయిత దర్శకుడు  మున్ననూరు రాజేశ్వర రావు (77) అనారోగ్యంతో ఈరోజు హౌసింగ్ బోర్డ్ లో స్వగృహంలో పరమపదించినారు. స్వగ్రామం తిమ్మాపూర్ కరీంనగర్ జిల్లా ఉన్నత విద్యావంతులు అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ లో 35 సంవత్సరాలు ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. చిన్నతనం లోనే వీరి అన్నగారైన హనుమంతరావు  అడుగుజాడల్లో నాటక రంగంలో ప్రవేశించి 50 సంవత్సరాల పాటు నాటక రంగానికి సేవ చేశారు. 

తిమ్మాపురం గ్రామంలో 1976లో "పదండి ముందుకు" అనే నాటకానికి దర్శకత్వం వహించి తిమ్మాపూర్ లో కళాకారులను ఎందరినో తీర్చిదిద్దారు. నవోదయ యూత్ అసోసియేషన్ తిమ్మాపూర్ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు, దారితప్పిన ఆకలి, మాయ తదితర నాటకాలకు దర్శకత్వం వహించారు. 1977 లో ఆల్ ఇండియా రేడియోలో నవోదయ యూత్ అసోసియేషన్ బ్యానర్ పై శాంతి పథం అనే నాటకాన్ని ప్రదర్శించడం జరిగింది. అందులో బుద్ధుడి పాత్ర ధరిస్తూ దర్శకత్వం వహించారు. మాలాంటి తిమ్మాపూర్ నటులందరికీ మార్గదర్శకులు. ప్రముఖ నటుడు వీరి అన్న గారైన హనుమంతరావు దర్శకత్వంలో ఆకు రాలినవసంతం నాటకంలో ముఖ్యమైన పాత్రను పోషించారు. అప్పట్లో ఈ నాటకం సంచలనం.

ఆ రోజుల్లోనే రాష్ట్రస్థాయిలో నెల్లూరు నెబ్జాలో ప్రదర్శించడం జరిగింది మనుషులు వస్తున్నారు జాగ్రత్త, దారితప్పిన ఆకలి పునర్జన్మ లాంటి పలు నాటకాలలో నటించాడు. జిల్లాలో మొదటి తరం నటుడు అని చెప్పవచ్చు. అక్షర ఉజ్వల కార్యక్రమంలో కూడా  పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లాలో అక్షర ఉజ్వల  కార్యక్రమానికి సంబంధించిన, కనకాల దేవదాసు దర్శకత్వంలో నవోదయం టెలి ఫిలిం లో కూడా ఒక ముఖ్యమైన పాత్రను ధరించాడు. రాజేశ్వరరావు మంచి రచయిత కూడా. ముత్తోజు రాజు దర్శకత్వం వహించిన షార్ట్ ఫిలింల కు రచయితగా నటుడిగా పనిచేశారు.వీరి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాం ఓం శాంతి.