17-09-2025 08:44:58 PM
ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): మహిళ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని విశ్వాసంతో స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జి. చిన్నారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ జ్యోతి ప్రజ్వలన్తో కలిసి జిల్లా ప్రభుత్వ జర్నల్ ఆసుపత్రిలో మెగా హెల్త్ క్యాంప్ ప్రచురణతో ప్రారంభించారు.
ఈ సందర్భంగా జి.చిన్నారెడ్డి మాట్లాడుతూ… ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, గ్రామాల్లో ఈ పథకం నేటి నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహిస్తారని చెప్పారు. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మంచి ఆహార అలవాట్లు అలవర్చుకోవాలన్నారు. మహిళలు ఆరోగ్యంగా, శారీరకంగా, మానసికంగా స్థిరంగా ఉండాలి. ఆరోగ్య పరీక్షలు చేయించుకొని కుటుంబాభివృద్ధికి సేవ చేయాలన్నారు.