calender_icon.png 17 September, 2025 | 9:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇన్సూరెన్స్ తప్పక తీసుకోవాలి

17-09-2025 07:49:44 PM

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి..

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): ప్రతి ఒక్కరు ఆరోగ్య భీమా, జీవిత భీమా తీసుకోవాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(MLA Yennam Srinivas Reddy) సూచించారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారురాలు దాసరి లలితమ్మకు ఎమ్మెల్యే ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి యోజన పథకం ద్వారా వచ్చిన రూ.2 లక్షల జీవిత భీమాకు చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోస్టాఫీసులో మంచి పథకాలు ఉన్నాయని, ప్రైవేటు సంస్థలకన్నా మెరుగైన సేవలు పోస్టాఫీసు సిబ్బంది అందిస్తారని ఆయన చెప్పారు. పోస్టాఫీసు సిబ్బంది అందించే సేవలను ప్రజలు ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుండా మనోహర్, యాదిరెడ్డి, పోస్టాఫీసు సిబ్బంది సజ్జన్ కుమార్, విష్ణు వర్ధన్, పెంటయ్య, రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.