calender_icon.png 21 September, 2025 | 7:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనారోగ్య కారణాలతో చికిత్స పొందిన పేదవారికి ఆపద్బంధువు సీఎంఆర్ఎఫ్

21-09-2025 05:48:00 PM

సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి..

కరీంనగర్ (విజయక్రాంతి): వివిధ అనారోగ్య కారణాలతో ఆసుపత్రులలో చికిత్స పొందిన నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ ఆపద్బంధుగా ఉపయోగపడుతుందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి(Suda Chairman Komatireddy Narender Reddy) అన్నారు. ఆదివారం నగర కాంగ్రెస్ కార్యాలయంలో 38 మందికి దాదాపు 15 లక్షల రూపాయల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను సుడా చైర్మన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ పలు సమస్యల పరిష్కారానికి వేదిక అయ్యిందని, సీఎం రిలీఫ్ ఫండ్ తో పాటు ఇతర సమస్యల పరిష్కారానికి లబ్దిదారులు కార్యాలయానికి వస్తున్నారని అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నామని నరేందర్ రెడ్డి అన్నారు.