21-09-2025 05:56:48 PM
పట్టణంలో అన్నదానం..
మందమర్రి (విజయక్రాంతి): మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు(MLA Kokkirala Prem Sagar Rao) 65వ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ నాయకులు, పీఎస్ఆర్ అభిమానులు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని పాత బస్టాండ్ ఆవరణలో టీపీసీసీ సభ్యులు నూకల రమేష్ ఆధ్వర్యంలో ఆదివారం మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ సాగర్ రావు జన్మదినం పురస్కరించుకొని కేకు కట్ చేసి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం అన్నదానం కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా టీపీసీసీ సభ్యులు నూకల రమేష్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, పేదల పెన్నిది ఉమ్మడి అదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల, ప్రజల ఆపద్బాంధ వుడు, కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అని అన్నారు. ఆయన నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండి, నిరుపేదలకు, కార్యకర్తలకు మరెంతో సేవ చేయాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.
జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతంచేసి మూడు నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడంలో జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు కృషి మరువలేనిదన్నా రు. ఇంద్రవెల్లి సభను లక్ష మందితో నిర్వహించి కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి జిల్లాలో పునరుజ్జీవం పోసిన మహా నాయకుడు ప్రేమ్ సాగర్ రావు అని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి మీడియా ఆండ్ కమ్యూని కేషన్ రాష్ట్ర కోఆర్డినేటర్ ఎండి ముజాహిద్, చెన్నూరు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఎండి నయీం, మార్కేట్ కమిటీ డైరెక్టర్ సిద్ధం జనార్దన్, జిల్లా ప్రధాన కార్యదర్శి రేవల్లి శ్రీకాంత్, జాడీ రాజేందర్, అరకల సతీష్ నరేందర్, ఎస్ఎం కో ఆర్డినేటర్ రంజిత్, నవీన్, అనిరుధ్, పత్తి సురేష్, సతీష్ లు పాల్గొన్నారు.