21-09-2025 05:44:28 PM
బాపూజీ చరిత్రను పాఠ్యపుస్తకంలో చేర్చాలి..
జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు మెతుకు సత్యం
కరీంనగర్: స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి కృషి చేసిన ఆచార్యకొండ లక్ష్మణ్ బాపూజీ రాష్ట్రానికి చేసిన సేవలు మరువలేనివని పద్మశాలి సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు వాసాల రమేష్, జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి పురస్కరించుకొని కరీంనగర్లోని బైపాస్ చౌరస్తా వద్ద గల బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఆదివారం నివాళులర్పించారు. అనంతరం వాసాల రమేష్, మెతుకు సత్యం మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడిగా, నిజాం నిరంకుశ వ్యతిరేక పోరాటంలో పాల్గొని జైలు జీవితం గడిపిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం కృషి చేసిన మహనీయుడని, జలదృశ్యం తన నివాసాన్ని ఉద్యమానికి కేంద్రంగా అంకురార్పణ చేసిన త్యాగశీలి అని అన్నారు. బాపూజీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం 1969లో మంత్రి పదవిని సైతం తృణప్రాయంగా వదిలివేసిన గొప్ప నిబద్ధత కలిగిన గొప్ప రాజకీయ వ్యక్త అన్నారు.
1969 నుండి వరకు తొలి మలి తెలంగాణ ఉద్యమంలో పూర్తిగా నిలిచిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. రాష్ట్రంలో చేనేత సహకార రంగానికి వినలేని కృషిచేసినాడని, గాంధీయవాదం, అహింస మార్గంలో ప్రజలకు దిశా నిర్దేశం చేసినాడన్నారు. తెలంగాణ రైతాంగ కార్మిక వర్గాల, విద్యార్థుల కష్టాలను దగ్గరగా చూసి వారికి న్యాయం చేయాలని నిరంతరం పాటుపడిన వ్యక్తి కొండ లక్ష్మణ్ బాపూజీ అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ఆచార్య బాపూజీ గా తన జీవన ధ్యేయంగా మార్చుకొని వ్యక్తిగత జీవితంలో ఎన్నో త్యాగాలు చేసినాడన్నారు. సదాసీదా జీవన విధానం, నిస్వార్థ సేవలో చివరి వరకు స్ఫూర్తిగా కొనసాగాలని అన్నారు. 90వ వయస్సులో సైతం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ సాధించడం కోసం ఢిల్లీలో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నాడనీ గుర్తు చేశారు.
కొండా లక్ష్మణ్ బాపూజీ జీవిత చరిత్రను ప్రభుత్వం పాఠ్యాంశాలలో చేర్చాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వోల్లాల కృష్ణహరి, పోపా అధ్యక్షులు పోలు సత్యనారాయణ, పట్టణ అధ్యక్షులు గడ్డం శ్రీరాములు, యువజన సంఘం అధ్యక్షులు గుడిమల్ల శ్రీకాంత్, మహిళా నాయకురాలు, మాజీ కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ, పద్మశాలి సంఘం జిల్లా ప్రచార కార్యదర్శి మార్త ప్రకాష్, జిల్లా నాయకులు ఇప్పనపల్లి సాంబయ్య, గడ్డం వెంకటేశం, మల్లికార్జున్, స్వర్గం నర్సయ్య, వేముల చంద్రశేఖర్, వంగరి ఆంజనేయులు, వొడ్నాల రవీందర్, ఎలిగేటి శ్రీనివాస్, ఎన్నం మునీందర్, ఎలిగేటి కిషన్, పిష్క లక్ష్మీనారాయణ, గజ్వేల్ కనకయ్య, నర్సప్ప, మెతుకు కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు.
భారీగా తరలివచ్చిన పద్మశాలి కులస్తులు..
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి పురస్కరించుకొని కరీంనగర్లోని బైపాస్ చౌరస్తా గల విగ్రహానికి కరీంనగర్ కు చెందిన పద్మశాలి సంఘ నాయకులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పద్మశాలి కులస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కొండ లక్ష్మణ్ బాపూజీ రాష్ట్రానికి చేసిన సేవలను వారు కొనియాడారు.