calender_icon.png 20 September, 2025 | 10:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధితులకు అండగా సీఎంఆర్ఎఫ్

20-09-2025 07:59:04 PM

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ

కామారెడ్డి (విజయక్రాంతి): సీఎంఆర్ఎఫ్ అనారోగ్య బాధితులకు ఎంతో ఆర్థిక నిలుస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ(State Government Advisor Shabbir Ali) అన్నారు. శనివారం సాయంత్రం కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బాధితులకు కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల కంటే ఎక్కువగానే అమలు చేస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇల్లు కొత్త రేషన్ కార్డులు అర్హులకు అందించామన్నారు. రుణమాఫీ చేసి చూపించామన్నారు. రైతులకు భరోసా అందిస్తున్నామన్నారు. మహిళలకు చిత్త బస్సు గ్యాస్ సిలిండర్ కు 500 రూపాయలు సబ్సిడీ 2 యూనిట్ల విద్యుత్ ఉచిత విద్యుత్తు అందిస్తున్నామన్నారు. భూభారతి ద్వారా రైతు సమస్యలు శాశ్వతంగా తొలగిపోతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు, మాజీ సిడిసి చైర్మన్ కారంగుల అశోక్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి నిమ్మ మోహన్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గూడెం శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పండ్ల రాజు, గొడుగుల శ్రీనివాస్, పుట్నాల శ్రీనివాస్ యాదవ్, దోమకొండ శ్రీనివాసు గుప్తా, తదితరులు పాల్గొన్నారు. 

కామారెడ్డి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయములో ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్  గారు కామారెడ్డి నియోజకవర్గానికి చెందిన వారికి ముఖ్యమంత్రి సహాయనిధి(CMRF) చెక్కులను దాదాపు 54 లక్షల రూపాయలు లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. కామారెడ్డి నియోజకవర్గంలోనీ పలు గ్రామాలలోని బాధితులకు సీఎం సహాయనిధి నుండి నిధులు మంజూరు చేయించడం జరిగిందన్నారు. అనారోగ్యంతో అప్పుల పాలైన వారికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఎంతో కొంత ఉపశమనం కలిగిస్తాయి అన్నారు. పేదలకు సహాయంగా అండగా. నియోజకవర్గ ప్రజల మంచి మాత్రమే కోరుకుంటామన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు అర్హులకు అందించామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల కంటే ఎక్కువగానే అమలు చేస్తున్నామన్నారు. రుణమాఫీ చేసి చూపించాం రైతు భరోసా అందిస్తున్నామన్నారు. మహిళలకు ఉచిత బస్సు 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. భూభారతి ద్వారా రైతుల సమస్యలు శాశ్వతంగా తొలిగిపోతాయన్నారు.