04-09-2025 12:50:06 AM
వరద ముంపునకు గురైన పంట పొలాలు పరిశీలించనున్న ముఖ్యమంత్రి
ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 3 : మొన్న కురిసిన భారీ వర్షాలకు అతలాకుతలమైన ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ప్రధాన రహదారి ఎల్లారెడ్డి కామారెడ్డి మార్గమధ్యంలో ఉన్న లింగంపేట్ లింగంపల్లి వంతెన వద్ద దారి తెగిపోవడంతో పలు గ్రామాల్లో పంట పొలాలు మునిగిన పంటలను పరిశీలించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం లింగంపేట మండలంలో గురువారం సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి లింగంపేట మండలం మోతే గ్రామానికి 11:30 కు చేరుకుంటారు. 11:45 కి లింగంపేట మండ లం లింగంపల్లి కుర్దు వద్ద ఇటీవల భారీ వర్షాలకు దెబ్బతిన్న ఆర్ అండ్ బి బ్రిడ్జిని పరిశీలిస్తారు. 12:15 కి లింగంపేట మండలం బురిగిద్ద వద్ద భారీ వర్షానికి పాడైన పంటలను పరిశీలిస్తారు.
అక్కడి నుంచి కామారెడ్డి జిల్లా కేంద్రానికి వెళ్లి జి ఆర్ కాలనీలో పర్యటిస్తారు. మధ్యాహ్నం రెండు గంటలకు లంచ్ తర్వాత 2:20కి జిల్లా అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహిస్తారు. 3:05 కి తిరిగి హెలికాప్టర్లో కామారెడ్డి నుంచి బేగంపేట్ కు బయలుదేరి వెళ్తారు. కలెక్టర్ ఆశిష్ సంఘ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.