04-09-2025 12:52:24 AM
పెద్ద కోడప్గల్, సెప్టెంబర్ 3 ః పెద్ద కొడప్గల్ రైతులకు సరిపడా యూరియాను రాష్ట్ర ప్రభుత్వం అందించాలని పెద్ద కోడప్ గల్ భారతీయ కిసాన్ సంఘం గ్రామ అధ్యక్షులు కుమార్ సింగ్ పేర్కొన్నారు. బుధవారం రోజున పెద్ద కోడప్ గల్ మండల కేంద్రం లో రోడ్డు పై రైతులు ధర్నా చేయడం జరిగింది. అనంతరం నాయబ్ తహసిల్దార్ కు వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా కుమార్ సింగ్ మాట్లాడుతూ... రైతులకు సరిపడా యూరియా అందుబాటులో లేకపోవడం తో రైతంగం చాలా ఇబ్బంది లో ఉందన్నారు.
యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి యూరియా ను అందుబాటులో తెచ్చి రైతుల సమస్యను పరిష్కరించి యూరియా కొరత లేకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమం లో పెద్ద కోడప్ గల్ గ్రామ కిసాన్ సంఘం అధ్యక్షులు కుమార్ సింగ్, మండల కార్యదర్శి బోడి రాజు యాదవ్, మండల సహాయ కార్యదర్శి బోడి మళ్ళీ కార్జున్, మండల అధ్యక్షులు జైత్రం, బాన్స్వాడ డివిజన్ సభ్యులు దేవి సింగ్, మొలుగు సంజీవ్ రెడ్డి,గ్రామ ఉపాధ్యక్షులు అప్రోజ్, జక్కుల అంజయ్య,రైతులు పాల్గొన్నారు.