నిర్మల్ జిల్లాలో చలి పంజా
- తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు
వ్యవసాయ పనులకు ఆటంకం
చిరు వ్యాపారులకు తప్పని ఇబ్బందులు
నిర్మల్ డిసెంబర్ 25 (విజయక్రాంతి) : నిర్మల్ జిల్లాలో చలి పంజా విసురుతుంది. గత వారం రోజులుగా జిల్లాలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో చలి తీవ్రత పెరిగి అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నిర్మల్ జిల్లాలో నీటి ప్రాజెక్టులతో పాటు చెరువులు గుట్టలు పంట పొలాలు ఎక్కువ ఉండడంతో చలి పెరగడానికి కారణంగా చెప్పుకుంటున్నారు. వారం రోజుల వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు ఎనిమిది డిగ్రీల వరకు ఉండగా ప్రస్తుతం ఆరు డిగ్రీల వరకు తగ్గినట్టు అధికారులు తెలిపారు గరిష్ట ఉష్ణోగ్రతలు 25 డిగ్రీలలోపై నమోదు అవుతున్నాయి.
దీంతో ఉదయం సాయంత్రం వేళలో చలి ప్రభావం ఎక్కువ ఉండడంతో రైతులు ప్రజలు రోగులు చిన్న పిల్లలు రోడ్లపై వ్యాపారం చేసే చిరు వ్యాపారులు వేకువజామునే కూరగాయలు పాలు ఇతర వ్యాపారం చేసేవారు చలి కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యవసాయ సీజన్ నేపథ్యంలో రైతులు పంట పొలాలకు వెళ్లి వ్యవసాయ పనులు చేసుకునేందుకు చలి తీవ్ర ఆటంకాన్ని కలిగిస్తుంది.
ఉదయం 10 గంటల వరకు సూర్యుడి వేడి తగలడంతో అప్పటివరకు ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉంటున్నారు అత్యవసర పరిస్థితుల్లో బయటకు వస్తే స్వెటర్లు వేసుకోవడం ఉంది దుస్తులు ధరించడం చేస్తున్నారు సుదూర ప్రయాణం చేసేవారు సూర్యుడు బయటకు వచ్చిన తర్వాతనే ప్రయాణాన్ని సాగిస్తున్నారు చేతిలో గ్లౌజు నెత్తికి రుమాలు కట్టుకుంటున్నారు ముఖ్యంగా చిన్నపిల్లలు గర్భిణీలు వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారు చలి కారణంగా బయటకు రాలేని పరిస్థితి నెలకొంది
వ్యాపారం పై తీవ్ర ప్రభావం
నిర్మల్ జిల్లాలో చలి పెరిగిన నేపథ్యంలో ప్రజలు బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో వ్యాపారంపై తీవ్ర ప్రభావాన్ని చెప్తోంది. గ్రామీణ పట్టణ ప్రాం తాల్లో చిరు వ్యాపారం చేసే అన్ని రకాల వ్యాపారుదారులు 11 తర్వాతనే జనం వచ్చి కొనుగోలను నిర్వహిస్తున్నంతో అప్పటివరకు వేచి చూస్తున్నారు సాయంత్రం నాలు గు గంటల తర్వాత చలి కారణంగానే ముందుగానే వెళ్లిపోవడంతో దుకాణాలు విలివెలబోతున్నాయి ముఖ్యంగా స్కూల్ పిల్లలు చలి బారిన పడడంతో ప్రభుత్వం ఇటీవలే దినోత్సవ షెడ్యూల్ 45 నిమిషాలు మార్చిం ది.
రాత్రి సమయంలో వాహనాలు నడిపేవారు ద్విచక్ర వాహనాలపై వెళ్లేవారు జాగ్ర త్తగా ఉండాలని పోలీసులు ప్రచారం చేస్తున్నారు. చలి కారణంగా ముఖ్యంగా గుండెపోటు వా రు బీపీ షుగర్ చిన్న పిల్లల చర్మ వ్యాధులు జలుబు దగ్గు వంటి రోగాలు వస్తున్నాయని వారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
అప్రమత్తంగా ఉండండి
జిల్లాలో చలి ప్రభావం పెరిగిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు డాక్టర్ నాళం సప్న శశికాంత్ తెలిపారు. ముఖ్యంగా చిన్నపిల్లలు గుండె జబ్బులతో బాధపడుతున్న వారు ఇతర దీర్ఘకాలిక రోగాలను ఎదుర్కొంటున్న వారు ఉదయం సాయంత్రం వేళలో జాగ్రత్తగా ఉండాలని బయటకు రావద్దన్నారు.
చిన్న పిల్లలకు హిట్ మీటర్లు ఏర్పాటు చేసుకోవాలని వ్యాధులు సహకరిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. చలి కారణంగా శర్మ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉందని వేడి నీళ్లు వేడి వేడి ఆహార పదార్థాలు నివాసముండే ఇండ్లలోకి గాలి రాకుండా జాగ్రత్తలు చేపట్టాలన్నారు.
డాక్టర్ నాలం స్వప్న శశికాంత్, చిన్నపిల్లల వైద్యులు




