calender_icon.png 26 December, 2025 | 2:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థుల ఖర్చెంత

26-12-2025 12:31:23 AM

  1. ఒక్కో బీఆర్‌ఎస్ సర్పంచ్ అభ్యర్థికి రూ.లక్ష పార్టీ ఫండ్...?

అభ్యర్థులకు అందని పార్టీఫండ్

కాంగ్రెస్ లోనూ అదే తంతు 

లక్షల్లో ఖర్చు పెట్టామంటున్న  అభ్యర్థులు

గజ్వేల్, డిసెంబర్ 25: గడిచిన సర్పంచ్ ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గంలో ఆయా పార్టీల అభ్యర్థులు మద్యం, డబ్బులు భారీ స్థాయిలో పంపిణీ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. సర్పంచ్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పా ర్టీకి తరపున పోటీ చేసిన అభ్యర్థులకు ఒక్కో అభ్యర్థికి రూ.లక్ష చొప్పున నియోజకవర్గానికి దాదాపు రూ. 2 కోట్ల పార్టీ ఫండ్ వచ్చినట్లు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.

కానీ పోటీ చేసిన అభ్యర్థుల లో చాలామందికి పార్టీ ఫండ్ అందలేదని, తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకునే పోటీ చేసినట్లు వెల్లడిస్తున్నారు. ఒక్కో అభ్యర్థికి రూ.10 లక్షలు మొదలుకొని రూ. 20 లక్షలకు పైగా సర్పంచ్ ఎన్నికల్లో ఖర్చయినట్లు అభ్యర్థులు, వారి సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఎన్నికల నియమావళి అనుసరించి మేజర్ గ్రామపంచాయతీలో రూ. 1.5 లక్షలు, గ్రామపంచాయతీలో రూ. లక్ష చొ ప్పున సర్పంచ్ అభ్యర్థులు ఖర్చు చేయాల్సి ఉంది.

బిఆర్‌ఎస్ తోపాటు కాంగ్రెస్, బిజెపి తదితర పార్టీల అభ్యర్థులు సైతం కొన్ని లక్షల రూపాయలు ఖర్చు, విచ్చలవిడిగా మద్యం పంపిణీ చేశారు. కానీ గ్రామాలలో బిఆర్‌ఎస్ సర్పంచ్ అభ్యర్థులు మాత్రమే భారీ స్థాయిలో డబ్బులు మద్యం పంచినట్లు ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలోనూ చాలామందికి సర్పంచ్ అభ్యర్థులకు నామమాత్రంగా పార్టీ ఫండ్ ఇచ్చినట్టు సమాచారం. బిజెపి పార్టీలో పార్టీ ఎలాంటి ఫండ్ సర్పంచ్ అభ్యర్థులకు కేటాయించలేదని వినికిడి. 

అభ్యర్థులకు అందని పార్టీ ఫండ్

 లక్షలు ఖర్చుపెట్టి గ్రామ సర్పంచ్ స్థానాలకు పోటీ చేసిన బిఆర్‌ఎస్ అభ్యర్థులకు పార్టీ ఫండ్ అందనట్లు తెలుస్తోంది. గజ్వేల్ నియోజకవర్గ గ్రామాలలో బిఆర్‌ఎస్ సర్పం చ్ అభ్యర్థుల కోసం సుమారు రూ. 2 కోట్ల పార్టీ ఫండ్ రాగా ఒక్కొక్కరికి కనీసం రూ. లక్ష ఇవ్వాల్సి ఉంది. కానీ అభ్యర్థులకు ఆ లక్ష రూపాయలు కూడా అందనట్లు అభ్యర్థులు వెల్లడిస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్ నియోజకవర్గంలో మాజీ సర్పంచులు అభివృద్ధి ప నులు చేసి అప్పుల పాలైనట్లు ఇప్పటికే ప్ర చారం జరుగుతుండగా, ఇటీవల జరిగిన స ర్పంచ్ ఎన్నికల్లో పార్టీ ఫండ్ కి కూడా నోచుకోకపోవడంతో ఈసారి సర్పంచ్ అభ్యర్థులు పోటీ చేయడంతోనే భారీగా అప్పుల పాలైనట్లు తెలుస్తోంది.

ఇండ్లు భూములు తాకట్టు పెట్టి మరి తెచ్చిన డబ్బులతో సర్పంచులుగా పోటీ చేశారు. పార్టీ అభ్యర్థులను కూడా పట్టించుకోని స్థాయిలో టిఆర్‌ఎస్ పార్టీ ఉం దా అని ఆయా గ్రామాల్లో చర్చ కొనసాగుతుంది. ఇదిలా ఉండగా కొన్ని గ్రామాల్లో ముఖ్య నాయకులు తమకు నచ్చిన వారికి భారీ స్థాయిలో పార్టీ ఫండ్ ఇచ్చినట్లు గుసగుసలు వినబడుతున్నాయి. పార్టీలో అసలు ఏం జరుగుతుందోనన్న అయోమయంలో నాయకులు కార్యకర్తలు ఉన్నట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీలోనూ సర్పంచ్ అభ్యర్థులకు పార్టీ ఫండ్ సరైన స్థాయిలో అందునట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీల అధిష్టానాలు సర్పంచ్ అభ్యర్థులకు పంపిన పార్టీ ఫండ్ పూర్తిస్థాయిలో అందకపోవడానికి ప్రధాన నాయకులే కారణంగా భావిస్తున్నా రు. ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల్లోనూ పార్టీల కోసం కష్టపడే నాయకులు కార్యకర్తలు సర్పంచ్ పోటీలో ఉంటే నాయకులు సహకరించాల్సింది పో యి తమకు వచ్చిన డబ్బులు కాజేసారన్న గుసగుసలు వినబడుతున్నాయి. ఈ విషయంలో పార్టీ అధిష్టానాలు పట్టించుకోక పోవడంతో ఆయా అభ్యర్థులు కూడా ఏమీ చేయలేకపోతున్నారు.