calender_icon.png 31 January, 2026 | 1:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుప్పకూలిన నాలా పైకప్పు

24-10-2024 01:57:22 AM

హైదరాబద్ సిటీబ్యూరో, అక్టోబర్ 23 (విజయక్రాంతి):  రోడ్డుతో సహా నాలా పైకప్పు కుప్పకూలిన ఘటన గోషామహల్‌లో మంగళవారం అర్ధరాత్రి తర్వాత చోటుచేసుకుంది. అఫ్జల్‌సాగర్ నుంచి వచ్చే ఈ నాలా దారుస్సలామ్, గోషామహల్, చాక్నావాడి, బేగంబజార్, గౌలిగూడ మీదుగా మూసీ నదిలో కలుస్తుంది. ఈ నాలాలో వర్షాకాలం సమయంలో వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో పాటు మురుగునీరు కూడా కలుస్తుంది.

రెండేళ్ల క్రితం కూడా చాక్నావాడి ప్రధాన రోడ్డుపై ఇదే విధంగా నాలా కుంగిపోవడంతో నూతనంగా పైకప్పును నిర్మా ణం చేశారు. కాగా, నాలా పైకప్పు కుప్పకూలిన విషయం తెలుసుకున్న జీహెచ్‌ఎంసీ ఖైరతాబాద్ జోనల్ ఎస్‌ఈ సహదేవ్, రత్నాకర్, గోషామహల్ సర్కిల్ ఈఈ అరుణ, వాటర్ బోర్డు జీఎం జాన్ షరీఫ్ బుధవారం పరిశీలించారు. కూలిపోవడానికి గల కారణాలపై విచారణ చేపడుతున్నారు