calender_icon.png 20 July, 2025 | 6:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను రద్దు చేయాలని కోటి సంతకాల సేకరణ

20-05-2025 12:00:00 AM

మంచిర్యా, మే 19 (విజయక్రాంతి) : ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని సిసిసి కార్నర్ వద్ద సోమవారం కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సంద-ర్భంగా వారు మాట్లాడుతూ ఆర్థిక పరమైన రిజర్వేషన్లు చెల్లవని 1993లో ఇందిరా సహోని కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని,

అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని ఆర్టికల్ 103 ను సవరించి ఈడబ్ల్యూఎస్ పేరుతో అగ్రకులాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిం చడం అంటే ఇది బీసీలకు తీవ్ర అన్యాయమేనన్నారు. ఏ ఉద్యమం చేయకుండానే అగ్రకులాలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించిన బిజెపి ప్రభుత్వం గత 40 సం వత్సరా లుగా బీసీల జనాభా ప్రతికన రిజర్వే-షన్లు కల్పించాలని ఉద్యమాలు చేస్తున్న మా న్యాయమైన మా ప్రజాస్వా మ్య వాటా ఇవ్వకపోవడం అంటే ఇది పూర్తిగా బీసీలపై వివక్ష గా భావిస్తున్నామని, మండ ల్ కమిషన్ సిఫార్సు ప్రకారం కనీసం 27 శాతం రిజర్వేషన్లు కూడా అమలు చేసిన పాపాన పోలేదన్నారు.

ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బీసీల న్యాయమైన ప్రజాస్వా మ్య వాటా 50 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాం డ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్, నాయకులు గజేల్లి వెంకటయ్య శాఖపురి భీంసేన్, సీపతి రాములు, తోకల వెంకటేష్ పాల్గొన్నారు.