స్ట్రాంగ్‌రూంలలోని ఈవీఎంలపై ప్రత్యేక నిఘా
19-05-2024 | 01:53am
స్ట్రాంగ్‌రూమ్‌ల భద్రతను పరిశీలించిన కలెక్టర్
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 18(విజయక్రాంతి): స్ట్రాంగ్‌రూంల వద్ద విధులు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ఈవీఎంలపై ప్రత్యేక నిఘా ఉం చాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. శనివారం ఆయన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లోని కమలా నెహ్రూ పాలిటెక్నిక్‌లో స్ట్రాంగ్‌రూమ్‌లని పరిశీలించారు. చార్మినార్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంలను ఈ కళాశాలలో భద్రపర్చగా.. ఈ స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద పోలీసు భద్రత, సీసీ కెమెరాల పనితీరు, పోలీసు సిబ్బంది విధుల నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద భద్రత కట్టుదిట్టంగా ఉండేలా చూడాలని ఆదేశించారు.






