3 September, 2026 | 4:21 AM

లోక్‌అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి

19-05-2024 | 01:56am

జహీరాబాద్, మే 18: రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యా యసేవాధికార సంస్థ సౌజన్యంతో మండల లీగల్ సర్వీసెస్ కమిటీ, జహీరాబాద్ వారి ఆధ్వర్యంలో జూన్ 8న జరిగే జాతీయ లోక్‌అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి, మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ సూరికృష్ణ తెలిపారు. శనివారం జహీరాబాద్ మున్సిఫ్‌కోర్టు ఆవరణలో న్యాయవాదులు, బ్యాంకు అధికా రులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ లోక్‌అదాలత్ వల్ల కలిగే ప్రయోజనాలను సంబంధిత అధికారులు, బ్యాంకు మేనేజర్లు వారి ఖాతాదారులకు తెలియ జేయాలన్నారు. రాజీమార్గం ద్వారా వివిధ కేసులను సత్వర పరిష్కారం చేసుకోవడమే కాకుండా వీలువైన సమయాన్ని, డబ్బును అదా చేసుకోవచ్చన్నారు. బ్యాంకుల్లో రుణాలు తీసు కున్న ఖాతాదారులు ప్రత్యేక రాయితీల ద్వా రా వన్‌టైం సెటిల్మెంట్ పద్ధతిలో పరిష్కరించుకోవచ్చని, దీనిపై బ్యాంకు అధికారులు తమ బ్యాంకు పరిధిలోని ఖాతాదారులకు తెలియజేయాలన్నారు. సమావేశంలో బార్ అసోసియన్ అధ్యక్షుడు గోపాల్, న్యాయవాదులు సోమశేఖర్, జగన్, బ్యాంకు అధికారులు, లీగల్ సర్వీసెస్ సిబ్బంది, పారాలీగల్ వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.