03-08-2025 01:29:42 AM
జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్
కామారెడ్డి,(విజయక్రాంతి): కాలం చెల్లిన మందులను వినియోగించవద్దని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. శనివారం కామారెడ్డి మండలం క్యాసంపల్లిలో ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కేంద్రం ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య శాఖ అధికారి చంద్రశేఖర్ ను ఆదేశించారు. ఆసుపత్రిలో సీజన్లో వచ్చే వ్యాధులకు సంబంధించిన మందులు అందుబాటులో ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. కాలం చెల్లిన మందులను ఉంచవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ జిల్లా వైద్య శాఖ అధికారి ప్రభు కిరణ్, వైద్యాధికారి జోహా ముజీబ్, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.