calender_icon.png 3 August, 2025 | 4:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులైన 144 మందికి ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ

03-08-2025 01:27:13 AM

ముఖ్య అతిథిగా హాజరై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల: వేములవాడల సొంత ఇల్లు, జాగా లేని పేదలకు ఇందిరమ్మ రాజ్యంలో సొంతింటి కల నెరవేరుతుంది.పట్టణంలో 144మంది అర్హులకు బస్ డిపో పక్కన ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల స్థలంలో ఇల్లు పట్టాలను ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే కాదు శ్రీనివాస్ పంపిణీ చేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నిర్మించి నిరుపయోగంగా మారిన ఇండ్లను ఈ రోజు పేద ప్రజలకు పంపిణీ చేశామన్నారు.

 బస్ డిపో పక్కన ఉన్న నిర్మాణానికి 7కోట్ల63లక్షలు మంజూరు అయి, అందులో 2కోట్ల ఖర్చు పెట్టగా మిగిలిన 5కోట్ల 63లక్షలను 144మందికి పంచుతూ నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు.12 బ్లాకులలో, జి ప్లస్ రెండు తో 144 ఇండ్లు ఉన్నాయని గత ప్రభుత్వం గత పదేళ్లుగా పేదలకు ఇండ్లు ఇవ్వలేదు.. కానీ మేము ఇచ్చే ఇళ్లతో పేదల కళ్ళల్లో ఆనంద బాష్పాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.ఇండ్లు పొందిన ప్రజలు అభిమానంతో సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలు పెట్టుకున్నారని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలతో లబ్ది పొందుతున్న ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనందంగా ఉన్నారని హర్షం వ్యక్తం చేశారు.