calender_icon.png 3 August, 2025 | 3:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భరణం కింద భార్యకు రూ.కోటికి పైగా చెల్లించిన భర్త

03-08-2025 01:32:10 AM

ఆదిలాబాద్ జిల్లా కోర్టు తీర్పు

ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఓ భార్యకు భరణం కింద రూ. కోటి కి పైగా భర్త చెల్లించాలని జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. స్థానిక సంజయ్ నగర్  లో నివాసం ఉండే ఓ మహిళ, నార్నూర్ కు చెందిన ఆమె భర్త కొన్నాళ్ల కిందట విడిపోయారు. వీరికి ఇద్దరు మగ సంతానం. కాగా భార్య భర్తపై భరణం కేసు పెట్టింది. దింతో అడ్వకేట్ నిఖిలేశ్ తొగరి కేసు వాదించారు. కాగా భార్యకు భరణంగా రూ.72 లక్షలు, పిల్లల చదువు కోసం రూ. 70 లక్షలు చెల్లించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు తీర్పు వెలువరించారు. ఈ మేరకు ఫిక్స్డ్ డిపాజిట్ పత్రాలను జిల్లా ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో పిల్లలకు, భార్యకు అందజేశారు. అనంతరం ఇద్దరు పిల్లల పై చదువులకు అవసరమైన ఖర్చంతా తండ్రి చెల్లించేలా ఆదేశించారు.