calender_icon.png 3 August, 2025 | 3:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్కూల్ బ్యాగ్స్, పెన్నులు నోట్ పుస్తకాలు పంపిణీ

03-08-2025 01:21:01 AM

గ్రేస్ సర్వీస్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు చేయూత

వాజేడు,(విజయక్రాంతి): ములుగు జిల్లా వాజేడు మండలంలో గ్రేస్ సర్వీస్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ ఖమ్మం వారు,మండలంలోని మోరుమూరు, బిజినేపల్లి, దూలపురం, ఇప్పగూడెం, గుమ్మడి దొడ్డి, చికుబెల్లి, చేరుకూరు,సారంగపురం, కడేకల్, కృష్ణాపురం, టెకులగూడెం , చంద్రుపట్ల, పెద్ద గొల్లగూడెం, పేరూరు కొత్తూరు, చిన్న గొల్లగూడెం, ధర్మవరం, అయ్యవారిపేట గ్రామాలలోనీ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న సుమారు 500 మంది నిరు పేద విద్యార్ధిని విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, పెన్నులు,నోట్ పుస్తకాలు, పలకలు శనివారం పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులు ఎంఈఓ వెంకటేశ్వర్లు హాజరై మాట్లాడుతూ నిరుపేద విద్యార్థిని విద్యార్థులకు విద్యా సామాగ్రి  పంపిణీ చేయడం చాలా సంతోషకరమని అన్నారు. ఇటువంటి సహాయాన్ని అందిస్తున్నటువంటి గ్రేస్ సర్వీస్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు . మారుమూల గిరిజన గ్రామాలలో పేద పిల్లలకు సహాయం చేయడానికి ఇటువంటి స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు రావడం చాలా అభినందనీయమనీ, సంస్థ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థ సిబ్బంది  జి.యస్.యస్ ప్రతినిధులు  ముర్రం రాజేష్, కంతి ముత్తయ్య, పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.