calender_icon.png 3 August, 2025 | 4:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిల్లలతో సహా వివాహిత అదృశ్యం

03-08-2025 01:36:54 AM

మేడిపల్లి: పిల్లలతో సహా వివాహిత అదృశ్యం అయిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మేకల రాశి వయసు (26)సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాల క్రితం మేకల రాజు అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది  వీరికి ఇద్దరు కూతుర్లు భవ్య (8) దివ్య(5) గత ఆదివారం నాడు రాత్రి సమయంలో భార్యాభర్తలు ఇద్దరికీ కుటుంబ విషయంలో గొడవ జరగగా మరుసటి రోజు ఉదయం ఆఫీస్ కని తన పిల్లలతో కలిసి ఇంట్లో  చెప్పకుండా వెళ్లిపోయి  మరల తిరిగి రాలేదు. ఈ విషయంపై మేకల రాశి తమ్ముడైన ఏనుగు రాహుల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని మేడిపల్లి సిఐ గోవింద రెడ్డి తెలిపారు.