03-08-2025 01:18:57 AM
కన్నాయిగూడెం బ్లాక్‌లో కీలక సూచికల సంతృప్తత కోసం అద్భుతమైన కృషికి జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ కు పురస్కారం
కన్నాయిగూడెం,(విజయక్రాంతి): సంపూర్ణత అభియాన్ కార్యక్రమం అమలులో అద్భుతమైన ప్రతిభ కనబరిచిన జిల్లా కలెక్టర్లను సత్కరించేందుకు ఈరోజు హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో రాష్ట్ర స్థాయి అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అత్యుత్తమ పనితీరు కనబరిచిన జిల్లాల కలెక్టర్లకు అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా కన్నాయిగూడెం బ్లాక్‌లో కీలక పనితీరు సూచికల సంతృప్తతను సాధించడంలో విశేష కృషి చేసినందుకు ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ కు అవార్డు లభించింది.