ప్రతి దరఖాస్తును సకాలంలో పరిష్కరించాలి
ప్రజావాణిలో 65 దరఖాస్తులు: జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
కామారెడ్డి,(విజయక్రాంతి): ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తులు సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ జిల్లా అధికారులకు సూచించారు.ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్ సమావేశ హాల్లో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ప్రజల నుండి వినతులు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన అర్జీదారులు తమ సమస్యలు, ఫిర్యాదులు, అభ్యర్థనలకు సంబంధించిన దరఖాస్తులను కలెక్టర్‌కు సమర్పించారు. ఈ సందర్భంగా మొత్తం 65 దరఖాస్తులు వచ్చాయని,
అర్జీదారులు సమర్పించిన వినతులను జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులకు పంపిస్తూ, వాటిని పరిశీలించి నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు, ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును సకాలంలో పరిష్కరించేందుకు జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్ వి గిరి, డి ఆర్ ఓ పాండు, జెడ్ పి సి ఈ ఓ చందర్, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.






