8 June, 2026 | 5:58 PM

గ్రామాల మౌలిక వసతుల కల్పనకు దశలవారీగా నిధుల మంజూరు: ఎమ్మెల్యే

08-06-2026 04:39 PM

బోథ్,(విజయక్రాంతి): గ్రామాల అభివృద్ధికి దశలవారీగా నిధులు మంజూరు చేయించి అన్ని గ్రామాల ప్రజల ఇబ్బందులను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే జాదవ్ అనిల్ పేర్కొన్నారు. సోమవారం బూతు మండలంలోని ఉచిర్యాల గ్రామానికి రెండు కోట్ల రూపాయలతో బీటీ రోడ్డు  నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఆర్ అండ్ బి రోడ్డు నుండి నాగపూర్ మీదుగా మంద బొగుడ వరకు నిర్మించనున్న ఈ రోడ్డును సకాలంలో పూర్తి అయినట్లు ఆయన పేర్కొన్నారు.

దశాబ్దాల కాలంగా ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని చేయించడం జరిగిందన్నారు. అంతకుముందు నేరడిగొండ మండలంలోని బుద్ధికొండ నుండి తేజపూర్ వరకు నిర్మించాను అన్న డ్యూటీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. రెండు కోట్ల రూపాయలతో నిర్మించే ఈ రోడ్డు వల్ల ఆయా గ్రామాల ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. గతంలో గ్రామస్తులకు ఇచ్చిన హామీ మేరకు ఈ రోడ్డును పూర్తి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధికి దశలవారీగా అన్యులను తీసుకురావడం జరుగుతుందని పేర్కొన్నారు.