గ్రామాల సమస్యల పరిష్కారానికి గ్రామసభలు ఎంపీడీవో
08-06-2026 04:46 PM
బోథ్,(విజయక్రాంతి): గ్రామాల సమస్యల పరిష్కారానికి గ్రామ సభలను నిర్వహించడం జరుగుతుందని ఎంపీడీవో ఎల్ రమేష్ పేర్కొన్నారు. సోమవారం మండలంలోని పాట్నాపూర్ గ్రామంలో సర్పంచ్ పంద్రం సుగుణ అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సమావేశాలలో గ్రామాల ప్రజల అవసరాలను గుర్తించి సమస్యలను పరిష్కరించేందుకు సమావేశాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరి ఉపాధి హామీ పనులు విద్యుత్ ఆరోగ్యం ఇందిరా క్రాంతి రెవెన్యూ శాఖల పనితీరును సమావేశంలో చర్చించారు. సమావేశంలో ఉప సర్పంచ్ ఆత్రం మోహన్ డాక్టర్ ప్రియాంక పాఠశాల ప్రధానోపాధ్యాయులులాలు రామ్ ఇన్చార్జి సెక్రటరీ బాబురావు తదితరులు పాల్గొన్నారు.






