20-08-2025 01:15:16 AM
అలంపూర్: దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ప్రముఖ ఐదవ శక్తిపీఠమైన అలంపూర్ శ్రీ జోగుళాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను జిల్లా కలెక్టర్ బి యం సంతోష్ సతీ సమేతంగా మంగళవారం సాయంత్రం దర్శించుకున్నట్లు ఆలయ ఈవో దీప్తి తెలిపారు. ఆలయ అధికారులు అర్చకులు ఆలయ మర్యాదలతో కలెక్టర్ కు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఉభయ ఆలయాల్లో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు అర్చకులు వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.