04-07-2025 12:00:00 AM
రాజన్న సిరిసిల్ల, జూలై - 3 (విజయక్రాంతి ) జిల్లాలోని పలు ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గురువారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చిన్న బోనాల గురుకుల వసతి గృహం, పెద్దూర్ లోని మహాత్మా జ్యోతి భాపూలే వసతి గృహం, మండేపల్లిలోని బాలుర హాస్టల్,
సిరిసిల్ల లోని మహాత్మా జ్యోతి భాపూలే బాలికల వసతి గృహం, తంగళ్ళపల్లి మండలంలోని మైనారిటీ సంక్షేమ శాఖ బాలికల వసతి, బద్దెనపల్లి లోని బాలికల ఎస్సీ వసతి గృహంలకు కలెక్టర్ చేరుకొని ముందుగా ఆయా హాస్టళ్ల పరిసరాలు, కిచెన్, నిలువ చేసిన ఆహార పదార్థాలు, పండ్లు, కూరగాయలు, బియ్యం, త్రాగు నీరు, తదితర అంశాలుతనిఖీచేశారు.