calender_icon.png 4 July, 2025 | 5:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వసతి గృహం విద్యార్థులకు మెనూ అమలు చేయాలి

03-07-2025 11:23:50 PM

సంక్షేమ వసతి గృహాలను తనిఖీ చేసిన ఎస్సీ ఈడీ దుర్గాప్రసాద్..

మందమర్రి (విజయక్రాంతి): తెలంగాణ సాంఘిక సంక్షేమ వసతి గృహ విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని సాంఘీక సంక్షేమ శాఖ ఈడి చాతరాజుల దుర్గాప్రసాద్(Social Welfare Department ED Chatarajula Durga Prasad) ఆదేశించారు. పట్టణంలోని పాత బస్టాండ్ లోనీ సాంఘిక సంక్షేమ బాలికల కళాశాల వసతి గృహాన్ని, భాగ్యనగర్ కాలనీలో గల సాంఘిక సంక్షేమ బాలుర కళాశాల వసతి గృహాన్ని, శ్రీపతి నగర్ లో గల సాంఘిక సంక్షేమ బాలుర పాఠశాల వసతి గృహాన్ని ఆయన సందర్శించారు.

ఈ సందర్భంగా విద్యార్థుల హాజరు రికార్డులను, విద్యార్థులకు అందిస్తున్న భోజన వివరాలను ఆయన పరిశీలించారు. సంక్షేమ వసతి గృహాలలో చదువుకునే విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలను అందించాల్సిన బాధ్యత హాస్టల్ వార్డెన్ లదేనని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని  వంట గది, హాస్టల్ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని విద్యార్థులకు ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు కలగవద్దని ఆయన సూచించారు. నిత్యం విద్యార్థులతో మమేకమై వారి బాగోగులు చూడాలని అన్నారు. ఆయన  వెంట ఏఎస్ఓ రవీందర్, వార్డెన్ లు తిరుమల, కిషోర్, శ్రీనివాస్ లు పాల్గొన్నారు.