calender_icon.png 14 August, 2025 | 3:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్, సీపీ,మున్సిపల్‌కమిషనర్

14-08-2025 12:49:15 AM

కరీంనగర్, ఆగస్టు 13 (విజయ క్రాంతి): నగరంలో వరద ప్రభావిత ప్రాంతాలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, సిపి గౌస్ ఆలం, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ బుధవారం పరిశీలించారు. భారీ వర్షం కురిసినప్పుడు తొందరగా ముంపునకు గురవుతున్న జగిత్యాల రోడ్డు, వన్ టౌన్ ఏరియా, నగరంలో ప్రధాన నాళాలు ప్రవహించే ప్రాంతాలను పరిశీలించారు. వరద నీరు త్వరగా వెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

ముంపు సమస్య పరిష్కారానికి మున్సిపల్ కమిషనర్ కు కలెక్టర్ పలు సూచనలు చేశారు. జగిత్యాల రోడ్డులో మంజూరైన ప్రధాన నాళా నిర్మాణాన్ని ప్రారంభించాలని, వన్ టౌన్ వద్దగల నాలా పునర్నిర్మాణానికి ఎస్టిమేషన్ సిద్ధం చేయాలని అన్నారు. ప్రధాన నాలాలో ఉన్న పూడికను తొలగించాలని ఆదేశించారు.