14-08-2025 12:49:09 AM
దేశాన్ని ఏఐ రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దిన వందమంది ప్రభావవంతుల్లో ఒకరిగా గుర్తింపు
జాబితాలో ఏడో స్థానంలో.. ప్రకటించిన అనలిటిక్స్ ఇండియా మ్యాగజైన్
హైదరాబాద్, ఆగస్టు 13 (విజయక్రాంతి): తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు అరుదైన గౌరవం లభించింది. అనలిటిక్స్ ఇండియా మ్యాగజైన్ తాజాగా ప్రకటించిన ‘ఇండియాస్ 100 మోస్ట్ ఇన్‌ఫ్ల్యూయెన్షియల్ పీపుల్ ఇన్ ఏఐ జాబితాలో ఆయనకు చోటు లభించింది.
తమ సమర్థవంతమైన నాయకత్వం, నూతన ఆవిష్కరణ లకు ప్రోత్సాహామిస్తూ భారత్‌ను ఏఐ రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దేందు కు కృషి చేస్తున్న వ్యక్తులకు ఇందులో చోటు కల్పించారు. విధాన రూపకర్తల విభాగంలో మంత్రి శ్రీధర్‌బాబుతోపాటు కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, పీయూష్ గోయల్, కేంద్ర మాజీమంత్రి రాజీవ్ చంద్రశేఖర్, ఇండియా ఏఐ మిషన్ సలహాదారు ఆకృత్ వైష్, ఇండియా ఏఐ మిషన్ సీఈవో, ఎన్‌ఐసీ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్, ఎన్‌పీసీఐ సీఈవో దిలీప్ అస్బే, నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్, నాస్కామ్ మాజీ అధ్యక్షుడు దేబజాని ఘోష్ తదితర ప్రముఖులను ఎంపిక చేసినట్టు నిర్వాహకులు ప్రకటించారు.
ఏఐలో తెలంగాణ రోల్‌మోడల్..
మంత్రి శ్రీధర్‌బాబు నాయకత్వం లో ఏఐ రంగంలో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా మారిందని, అందుకే ఆయనను ఈ జాబితాలో చేర్చినట్టు అనలిటిక్స్ ఇండి యా మ్యాగజైన్ నిర్వాహకులు ప్రకటించారు. ‘బాధ్యతాయుతమైన ఏఐ అమలు కోసం సమగ్ర ఏఐ ఆధారిత తెలంగాణ స్ట్రాటజీ అండ్ రోడ్ మ్యాప్‌ను రూపొందించడంలో కీలకంగా వ్యవహరించారు.
గుడ్ గవర్నెన్స్, నూతన ఆవిష్కరణలు, సురక్షితమైన డేటా షేరింగ్‌ను ప్రోత్సహించేలా దేశంలోనే తొలిసారిగా ఏఐ ఆధారిత తెలంగాణ డేటా ఎక్స్ఛేంజ్ ను ప్రారంభించేందుకు చొరవ చూపారు’ అని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబును కొనియాడారు. ‘గ్లోబల్ ఏఐ సమ్మిట్ నిర్వహణలో నూ మంత్రి శ్రీధర్‌బాబు కీలకంగా వ్యవహరించారు.
తెలంగాణలో ఏఐ ఎకో సిస్టమ్‌ను మరింత బలోపేతం చేసేలా 2025 100 గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లను ప్రారంభించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. ఆర్ అండ్‌డీ, నూతన ఆవిష్కరణలు, అత్యంత నైపుణ్యమున్న మానవ వనరులను తయారు చేయాలనే సంకల్పంతో ఏర్పాటు కానున్న ఏఐ యూనివర్సిటీ విషయంలోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారు’ అని ప్రశంసించారు.
ఏఐ రంగంలో తెలంగాణ బ్రాండ్ మరింత విశ్వవ్యాప్తమయ్యేలా మంత్రి శ్రీధర్‌బాబుకు దక్కిన ఈ గుర్తింపు దోహదపడు తుందని అభిప్రాయపడ్డారు. శ్రీధర్‌బాబుకు ఇండియాస్ ౧౦౦ మోస్ట్ ఇన్‌ఫ్ల్యూయెన్షియల్ పీపుల్ ఇన్ ఏఐ ౨౦౨౫ జాబీతాలో చోటు దక్కడంపై సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్‌లో అభినందనలు తెలిపారు.
సీఎం రేవంత్‌రెడ్డి ప్రోత్సాహంతోనే ఈ గుర్తింపు: మంత్రి శ్రీధర్‌బాబు
ఇది నా ఒక్కడికి లభించిన గుర్తింపు కాదు. యావత్తు తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవం. సమ్మిళిత వృద్ధి, మెరుగైన జీవితాలను అందించేందుకు ఏఐని వినియోగించాలన్న ప్రభుత్వ సుదూర దృష్టికి ఈ గుర్తింపు నిదర్శనం. సీఎం ప్రోత్సాహంతోనే నాకు ఈ జాబితా లో చోటు దక్కింది.
ఆయన నాయకత్వంలో తెలంగాణను ఏఐ క్యాపిటల్ ఆఫ్ ది గ్లోబ్‌గా తీర్చిదిద్దేలా పకడ్బందీ కార్యాచరణతో ముం దుకెళ్తున్నాం. నూతన ఆవిష్కరణలకు సమానత్వా న్ని జోడించి, సాంకేతిక పురోగతి ఫలితాలు రాష్ర్టంలోని ప్రతి పౌరుడికి అందేలా కృషి చేస్తున్నాం.
సెమీ కండక్టర్ ప్రాజెక్టు కేటాయింపులో కేంద్రం వివక్ష
పారిశ్రామికాభివృద్ధిలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణకు రాజకీయ అక్కసుతోనే కేంద్రం అన్యా యం చేస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆవేదన వ్యక్తం చేశారు. సెమీ కండక్టర్ ప్రాజెక్టు కేటాయింపులో వివక్ష చూపించి, రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమను చూపిస్తుందంటూ బుధవా రం విడుదల చేసిన ఓ ప్రకటనలో మండిపడ్డారు.
ప్రపంచ స్థాయి అధునాతన సిస్ట మ్ అండ్ ప్యాకేజింగ్ ఫెసిలిటీ ఏర్పాటు కోసం రాష్ర్ట ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని, మహేశ్వరంలో 10 ఎకరాల భూ మి కేటాయించడంతోపాటు అన్ని రకాల సబ్సిడీలకు ఆమోదం తెలిపామని వివరించారు. రికార్డు సమయంలో అన్ని అను మతులిచ్చామని, ఇండియా సెమీ కండక్టర్ మిషన్ తుది ఆమోదం లభిస్తే పనులు మొదలు పెట్టేందుకు సదరు ఇన్వెస్టర్ సిద్ధంగా ఉన్నా కేంద్రప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు.
అన్ని రకాలుగా అర్హతలున్నా తెలంగాణను విస్మరించి కనీ స సంసిద్ధత లేని ఏపీకి ప్రాజెక్టును ఎలా కేటాయిస్తారని మంత్రి శ్రీధర్‌బాబు కేం ద్రాన్ని ప్రశ్నించారు. తర్కానికి అందని, న్యాయ విరుద్ధమైన ఈ నిర్ణయం పెట్టుబడిదారులకు తప్పుడు సంకేతాలను పంపే ప్రమాదముందని అభిప్రాయపడ్డారు.
ఇ లాంటి రాజకీయ ప్రేరేపిత నిర్ణయాలు దేశ పారిశ్రామికాభివృద్ధికి మంచిది కాద ని హితవు పలికారు. అందుకే ఈ నిర్ణయా న్ని మరోసారి పున:పరిశీలించాల్సిన అవసరముందని, వాస్తవ పరిస్థితులను పరి గణలోనికి తీసుకొని తెలంగాణకు మేలు చేసేలా కేంద్రం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి జోక్యం చేసుకొని తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని, రాష్ట్రానికి న్యాయం జరిగేలా చొరవ చూపాలని కోరారు. రాష్ర్ట ప్రయోజనాల ను కాపాడాల్సిన తెలంగాణ బీజేపీ ఎంపీ లు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు.