calender_icon.png 17 January, 2026 | 10:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వీటీడీఏ పనులను శివరాత్రిలోగా పూర్తి చేయాలి

17-01-2026 09:04:07 PM

ఇంచార్జి జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్

వేములవాడ,(విజయక్రాంతి): వీటీఏడీఏ ఆధ్వర్యంలో వేములవాడలో చేపట్టిన అభివృద్ధి పనులను శివరాత్రి జాతరలోగా పూర్తి చేయాలని ఇంచార్జి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. కోరుట్ల బస్టాండ్ నుంచి చెక్కపల్లి చౌరస్తా వరకు రోడ్డు పనులు, తిప్పాపూర్ నుంచి ఆలయం వరకు రోడ్డు విస్తరణ, గుడి చెరువు సుందరీకరణ, నాంపల్లి గుట్ట అభివృద్ధి పనులను శనివారం ఆమె పరిశీలించారు. రోడ్డు నిర్మాణంతో పాటు మురుగు కాలువలు పూర్తి చేయాలని, నాణ్యతతో యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాలని సూచించారు.

మూలవాగు బ్రిడ్జి నుంచి రాజన్న ఆలయం వరకు ప్రధాన రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేయాలని ఆదేశిస్తూ, ప్రతి రెండు రోజులకు ఒకసారి సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. గుడి చెరువు బండ్ పార్క్‌ను భక్తులకు, ప్రజలకు ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని సూచించారు. అలాగే నాంపల్లి గుట్టపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన విమానం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. పరిశీలనలో ఆర్డీఓ రాధాభాయ్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.