17-01-2026 09:10:11 PM
రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): వేములవాడ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు స్థలాలు ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ శనివారం పరిశీలించారు. చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి, చందుర్తిలో వేర్ హౌస్ గోదాం కోసం, మర్రిపల్లి గ్రామంలో రైతు విజ్ఞాన కేంద్రం నిర్మాణానికి, వేములవాడ అర్బన్ మండలం నాంపల్లి వద్ద బీసీ భవన్ నిర్మాణానికి రెవెన్యూ అధికారులతో కలిసి ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ స్థలాలు పరిశీలించారు. ఆయా గ్రామాల్లో స్థలాలకు సంబంధించిన నక్షాలు పరిశీలించి.. అధికారులతో చర్చించారు. పరిశీలనలో వేములవాడ ఆర్డీఓ రాధాభాయ్, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, తహసీల్దార్లు భూపతి, అబూబాకర్ తదితరులు పాల్గొన్నారు.