ఈవీఎం గోదామును తనిఖీ చేసిన కలెక్టర్
11-07-2026 12:00 AM
నిర్మల్ జులై 10 ( విజయక్రాంతి): కలెక్టరేట్ సమీపంలో గల ఈవీఎం గోదాం కేంద్రాన్ని సాధారణ తనిఖీల్లో భాగంగా శుక్రవారం జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అన్ని రిజిస్టర్లను పరిశీలించారు. చేశారు. సీసీ కెమెరాల పనితీరు చూశారు. అగ్నిమాపక వ్యవస్థ పనితీరు తనిఖీ చేశారు. పోలీసు సిబ్బంది నిరంతరం సీసీ కెమెరాలు పర్యవేక్షణతో మెరుగైన భద్రతను నిర్వహించాలని తెలిపారు.
సిబ్బంది పటిష్ట అగ్నిమాపక వ్యవస్థ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఈ తనిఖీలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, అగ్నిమాపక అధికారి శివాజీ, తహసిల్దార్ రాజు, అధికారులు స్వాతి, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.






