11 July, 2026 | 1:52 AM

ప్రభుత్వ బడుల్లో వంద శాతం హాజరే లక్ష్యం

11-07-2026 12:00 AM

కలెక్టర్ రాజర్షి షా 

ఆదిలాబాద్, జూలై 10 (విజయక్రాంతి) : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు వంద శాతానికి పెంచడమే లక్ష్యంగా అధికారులు, సిబ్బంది పని చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా ఆదేశించారు. శుక్రవారం పట్టణంలోని భూక్తాపూర్ కాలనీలోని వెటర్నరీ ఆసుపత్రి భవనంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు కేటాయించిన తరగతి గదులను మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష, డీఈఓ మాధవితో కలిసి ఆయన ప్రారంభించారు.

అనంతరం వయోవృద్ధుల సమాఖ్య ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, వాటర్ బాటిళ్లు, ప్లేట్లను పంపిణీ చేశారు.  అంతకుముందు పశువైద్యశాల ఆ వరణలో రూ.2 లక్షలతో నిర్మించిన షెడ్డును కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా క లెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మే రకు జిల్లాలో 15 ఏళ్లుగా మూతపడి ఉన్న 13 పాఠశాలలను తిరిగి ప్రారంభించినట్లు వెల్లడించారు.

ఈ బడుల్లో మెరుగైన వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందనీ, బడికి నూతన ఫర్నిచర్ను అందించడంతో పాటు, విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజ నం వడ్డించేందుకు వీలుగా త్వరలోనే ప్రత్యేక షెడ్డును నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అలా గే, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇక్కడ ప్రీ-ప్రైమరీ తరగతులను సైతం ప్రారంభిస్తామ ని స్పష్టం చేశారు.

పాఠశాల పునఃప్రారంభానికి కృషి చేసిన స్థానికులను, రిటైర్డ్ ఉద్యోగు లను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మహ్మద్ రోహిత్, పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి రామారావు రాథోడ్, ఏడీ గో పీకృష్ణ, ఎంఈఓ సోమయ్య, దేవీదాస్ దేశ్పాండే, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.