17 March, 2026 | 12:24 AM

Breaking News

అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల నిరసన   •   ఎమ్మెల్యే ఆఫీస్ పక్కనే అక్రమ కట్టడాలా?   •   9వ డివిజన్ మేడిపల్లి కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి   •   కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •  

ఈవీఎం గోదాంను పరిశీలించిన కలెక్టర్

09-12-2025 12:10 AM

నస్పూర్, డిసెంబర్ 8 : ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈ వీ ఎం) భద్రపరిచిన నస్పూర్ లోని గోదామును జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ సోమవారం జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి. చంద్రయ్య, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి సందర్శించి, బందోబస్తు ఏర్పా ట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల గోదాము వద్ద పోలీసు సిబ్బంది సమన్వయంతో పటిష్టమైన బందోబస్తు చేపట్టడంతో పాటు 24 గంటలు సి.సి. కెమెరాల ద్వారా పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. భద్రత సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం అధికారులు, గుర్తింపు పొం దిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.