09-12-2025 12:08:24 AM
ఆదిలాబాద్, డిసెంబర్ 8 (విజయక్రాంతి) : అడవుల జిల్లా ఆదిలాబాద్ చలికి వణికిపోతోంది. రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు అమాంతంగా పడిపోవడం, కేవలం సింగిల్ డిజిట్‌కు పరిమితం కావడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తరాది నుండి వీస్తున్న చలి గాలులతో జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. కొన్ని రోజులుగా వరకు సాధారణ ఉష్ణోగ్రతలే నమోదు కాగా గత రెం డు మూడు రోజులుగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఆదిలాబాద్ జిల్లాలోని ఏజె న్సీ ప్రాంతాల్లోనైతే చలి ఇబ్బందు అన్నీఇన్నీ కావు. చలి తీవ్రత రోజురోజుకు పెరిగిపోవడం తో ప్రజలు చలి నుండి రక్షణ కల్పించేందుకు చలి మంటలు కాగుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తె చలి నుండి రక్షణకు స్వెటర్లు, మఫ్లర్లను ధరిస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో జనాలు లేక రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనబడుతున్నాయి. ఓవైపు పోగామంచు కమ్ముకున్న దృశ్యాలు ప్రజలను అనువిందు చేస్తున్నప్పటికీ, మరోవైపు పొగమంచు కారణంగా రహదారులు కనబడగా వాహనదారులకు ఇబ్బందులు కలుగుతూ, ప్రమాదాలు సైతం చోటు చేసుకుంటున్నాయి.
సింగిల్ డిజిట్‌కు ఉష్ణోగ్రతలు...
ఆదిలాబాద్ జిల్లాలో చాలా చోట్ల కేవలం సింగిల్ డిజిట్‌కే ఉష్ణోగ్రతలు పరిమితం అయ్యాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నా రు. రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో అర్లి (టి) లో 6.8 కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలికి తోడు పొగ మంచు కమ్ముకుపోవడంతో పలు పల్లెల్లో హాల్లదకరమైన వాతావరణం దర్శనమిస్తోంది. కొండలు, గుట్టలు, లోయ ప్రాంతాల్లోనీ గ్రామాల్లో తెల్లవారుజామున పొగమంచు దుప్పటి కప్పినట్లుగా కనిపిస్తున్న దృశ్యాలు ప్రజలను కనువిందు చేస్తున్నాయి.
ఏజెన్సీ ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలను చలి పులి ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. మారుమూల గ్రామాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో జనాలు బయటకు రావడానికి జంపుతున్నా రు. చలి కారణంగా ఉదయం 9 గంటలకు సై తం ప్రజలు ఇంటి నుండి బయటకు రావడం లేదు. సాయంత్రం 5 గంటలలో ఇంటికి చేరుకుంటున్నారు. చలి నుండి రక్షణ పొందేందుకు ప్రజలు చలిమంటలు కాగుతున్న దృశ్యాలే ఎక్కడ చూసినా కనబడుతున్నాయి.
పొగమంచుతో ప్రమాదాలు...
గత కొన్ని రోజులుగా జిల్లాలో దట్టమైన పొగ మంచు కమ్ముకుంది. దీంతో రహదారులపై ప్రయాణించే వాహనదారులకు రాకపో కలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దట్టమైన పొగ మంచు కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు కనబడక తరచు ప్రమాదాలు సైతం చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా జాతీయ రహదారిపై పొగ మంచు తీవ్రంగా ఉండడంతో వానదారులు దినంలో సైతం వా హనాల లైట్లను వేసుకొని ప్రయాణం చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
పొగ మంచు కార ణంగా సోమవారం తెల్లవారుజామున గుడిహత్నూర్ మండలంలోని జాతీయ రహదా రిపై రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు. మహారాష్ట్ర నుండి హైదరాబాదు వెళుతున్న కారు పొగ మంచుతో రోడ్డు కనబడకపోవడంతో డివైడర్ ను ఢీకొని బోల్తా కొట్టి నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.