ఫైనాన్స్ సంస్థ వేధింపులు భరించలేక ఆత్మహత్య
చింతమడకలో ఘటన
సిద్దిపేట రూరల్, ఆగస్టు 31:ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ నిర్వాహకుల వేధింపులు భరించలేక రైతు రాందేని శ్రీనివాస్ (45) ఆత్మహత్య చేసుకున్న సంఘటన సిద్దిపేట రూరల్ మండలం చింతమడక గ్రామంలో ఆదివారం జరిగింది. ఉపాధి కోసం ఫైనాన్స్ ద్వారా ట్రాక్టర్ తీసుకున్నడు ఇటీవల ట్రాక్టర్ కు పని లేకపోవడంతో వాయిదాలు చెల్లించలేక ట్రాక్టర్ ని ఫైనాన్స్ నిర్వాహకులు అప్పు కిందికి తీసుకెళ్లారు.
బైక్ కు తీసుకున్న ఫైనాన్స్ వాయిదాలు చెల్లించలేదని నిర్వాహకులు ఆదివారం ఇంటి వద్దకు వచ్చి గొడవ చేసి బైక్ ను కూడా తీసుకెళ్లారు. దాంతో అవమానంగా భావించిన శ్రీనివాస్ గ్రామం చివరణ గల చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహ త్య చేసుకున్నాడు. శ్రీనివాస్ మృతికి కారకులైన ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సిద్దిపేట రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






