విద్యార్థులకు ఇబ్బందులు కలగొద్దు
23-03-2026 12:00 AM
కలెక్టర్ కుమార్ దీపక్
జన్నారం, మార్చి 22 : ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఆదివారం జన్నారం మండల కేంద్రంలో గల ఆశ్రమ పాఠశాల, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంను సందర్శించి తరగతి గదులు, వంటశాల, భోజనశాల, నిత్యావసర సరుకుల నిల్వలు, మధ్యాహ్న భోజనం నాణ్యత, హాజరు పట్టికలు, వసతి గదులు, పరిసరాల పరిశుభ్రత పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ విద్యార్థులకు సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్య అందించే దిశగా కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.




