అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి
ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
ఉట్నూర్, మార్చి 22 (విజయక్రాంతి): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడంతో పాటు ఆయన ఆశను సాధన కృషి చేయాలని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పిలుపునిచ్చారు. ఆదివారం ఉట్నూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి పోస్టర్ లను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జు పటేల్ మాట్లాడుతూ... అంబేద్కర్ జయంతి వేడుకల్లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు లింగంపల్లి చంద్ర య్య, కాంగ్రెస్ జిల్లా నాయకులు దాసండ్ల ప్రభాకర్, ఆర్టిఏ సభ్యుడు దూత రాజేశ్వర్, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. అదేవిదంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిలుగా నియమితులైన మెస్రం నాగనాథ్, ఎండి మసూద్ లను ఎమ్మెల్యే అభినందించాటు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏపీ టీసీ, జెడ్పిటిసి స్థానాలను భారీ మెజార్టీతో కాంగ్రెస్ కైవసం చేసుకునే విధంగా గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ ముం దుకు సాగాలని ఎమ్మెల్యే సూచించారు.




