ఈవీఎం గోడౌన్‌ను సందర్శించిన కలెక్టర్ నారాయణరెడ్డి
రాజేంద్ర నగర్ డిసెంబర్ 10, (విజయక్రాంతి): గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో రంగారెడ్డి జిల్లా రాజేందర్ నగర్ లోని ఈవీఎం గోడౌన్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి అధికారులతో కలిసి త్రైమాసిక తనిఖీ నిర్వహించారు. భద్రపరిచిన బ్యాలెట్ యూనిట్ లు, ఎన్నికల సామాగ్రిని గదులను కలెక్టర్ సి.నారాయణ రెడ్డి పరిశీలించారు.
ఈ సందర్భాంగా కలెక్టర్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వివరాల గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈవీఎంలు, బ్యాలెట్ యంత్రాల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ గోదాము సీల్ ను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తెరిచి యంత్రాలను పరిశీలించడం జరిగింది. అనంతరం వారి సమక్షంలో సీల్ వేయించడం జరిగినది.
ఈ కార్యక్రమంలో రాజేందర్ నగర్ ఆర్డీఓ వెంకట్ రెడ్డి, తహశీల్దార్, వేర్ హౌస్ ఇంచార్జీ బొమ్మ రాములు, సంబంధిత అధికారులు, రాజకీయ పార్టీలు బిజెపి నాయకులు ఎన్.రవి కుమార్, కె. సతీష్ కుమార్, ఎంఐఎం నాయకులు సయ్యద్ సిరాజ్, సిపిఐ నాయకులు ఎన్. నర్సింహా రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కె.బాల్రాజ్,అర్షద్,అబ్దుల్ బారీ, టిడిపి నాయకులు ఎన్.వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.






