15 April, 2026 | 7:21 AM

శబరిమలకు బయలుదేరిన అయ్యప్ప స్వాములు

11-12-2025 12:00 AM

మేడ్చల్ అర్బన్ డిసెంబర్ 10 (విజయక్రాంతి):ఎల్లంపేట్ మున్సిపల్ పట్టణంలోని శ్రీ అష్ట సిద్ధిగణపతి దేవాలయం సన్నిధాన అయ్యప్ప స్వాములు అయ్యప్ప మండల దీక్ష పూర్తి చేసుకుని ఇరుమూడ్లు కట్టుకొని శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం కొరకు శ్రీనివాస్ గౌడ్ గురుస్వామి, హరిప్రసాద్ గౌడ్ స్వామీల ఆధ్వర్యంలో బయలుదేరినట్లు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు గౌరారం జగన్ గౌడ్ తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములకు ఇరుమూడ్లు కట్టిన గురుస్వాములు అశోక్ గౌడ్. ఎస్.ఆర్.కే గురుస్వామి, సిద్ధం గణపతి గురు స్వామి, సగ్గు ఆంజనేయులు యాదవ్ స్వాములు లక్ష్మి ప్రసాద్ గౌడ్, కంచుగంట మహేష్, శ్రీరాం గౌడ్, దేవా గౌడ్, మునిగొండ వెంకటేష్, సురేందర్ రెడ్డి, ప్రశాంత్ చారి, ఆచారి. మహేష్ గౌడ్, ఆరేల్లి నరేష్ గౌడ్, రాధకృష్ణ, వెంకటేష్, బాలు గౌడ్, సురేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.