6 August, 2026 | 4:17 PM

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేయాలి

06-08-2026 02:53 PM

భూపాలపల్లి,(విజయ క్రాంతి): స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. గురువారం ఐడిఓసి కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఏర్పాట్లపై ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. వేడుకలు ‘మినిట్ టు మినిట్’ ప్రణాళిక ప్రకారం లోపాలు లేకుండా నిర్వహించాలని, శాఖల వారీగా అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిబింబించే స్టాళ్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

ప్రజలకు ఇబ్బందులు లేకుండా షామియానాలు, విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్య సౌకర్యాలు కల్పించాలని, మెడికల్ క్యాంపులు, అగ్నిమాపక ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. లబ్ధిదారుల జాబితాలు సిద్ధం చేసి, ఆహ్వాన పత్రికలు సకాలంలో పంపిణీ చేయాలని చెప్పారు.ఎర్పాట్లను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి సమయానికి పూర్తి చేయాలని ఆర్డీఓను కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ సహా అధికారులు పాల్గొన్నారు.