6 August, 2026 | 4:19 PM

విద్యుత్ సబ్ స్టేషన్ స్థలం పరిశీలన

06-08-2026 02:50 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని సోఫీ నగర్ కాలనీలో నూతనంగా నిర్మించి విద్యుత్ సబ్ స్టేషన్ స్థలాన్ని జిల్లా విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజనీర్ ఏ రమేష్ గురువారం పరిశీలించారు. పట్టణంలో విద్యుత్ వినియోగదారులకు మెరుగైన నాణ్యమైన విద్యుత్ సేవలు అందించేందుకు త్వరలో ఈ ప్రాంతంలో సబ్స్టేషన్ నిర్మించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధికారి నాగరాజు పట్టణ ఏ డి ఏ శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.